Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › చింతపల్లి శ్రీ సాయిబాబా దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

చింతపల్లి శ్రీ సాయిబాబా దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు

చింతపల్లి, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): చింతపల్లి పట్టణంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ మహాసరస్వతీ దేవి అవతారాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 9 గంటలకు శ్రీ మహాసరస్వతీ దేవికి పంచామృతాలతో

04:43 సాయంత్రం PM

చింతపల్లి, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): చింతపల్లి పట్టణంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ మహాసరస్వతీ దేవి అవతారాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఉదయం 9 గంటలకు శ్రీ మహాసరస్వతీ దేవికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటలకు కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం భక్తిపూర్వకంగా జరిపారు. మధ్యాహ్నం శ్రీ సాయిబాబాకు హారతి సమర్పించిన తర్వాత 108 కలశాలతో, వివిధ రకాల పండ్లతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం కుమారి వనపర్తి వెంకట నాగసింధు సీతారామ కల్యాణం హరికథా గానాన్ని ఆలపించి భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు మంచికంటి ధనంజయ మాట్లాడుతూ, అమ్మవారి కటాక్షం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 8🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App