Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
Home › తాజా వార్తలు › చికిత్స కోసం రూ.2.50 లక్షల LOC అందజేత
తాజా వార్తలు

చికిత్స కోసం రూ.2.50 లక్షల LOC అందజేత

07:36 ఉదయం AM

అనారోగ్యంతో బాధపడుతున్న సాయి రాజ్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భరోసా

మంథని | AYUSH24 NEWS

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో మంథని నియోజకవర్గం, కాటారం మండలం, దేవరాంపల్లి గ్రామానికి చెందిన చీమల సాయి రాజ్ (తండ్రి: చీమల నర్సింహులు) వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.2,50,000 లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరు చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి రాజ్‌కు వైద్య ఖర్చుల కోసం సహాయం అవసరమని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి CMRF ద్వారా రూ.2.50 లక్షల LOC మంజూరు చేయించి, హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకుల ద్వారా సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి తమ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సాయి రాజ్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

“దుద్దిళ్ల హస్తం – పేదల నేస్తం” అంటూ స్థానికులు మంత్రి సేవలను అభినందించారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 1🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
679 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App