సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో అశ్రు నివాళులు
దేవరకొండ, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): దేవరకొండ పట్టణానికి చెందిన కీర్తిశేషులు చొల్లేటి భాస్కరాచారి మృతి బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
దేవరకొండ పట్టణంలోని మాజీ స్వర్ణకార సంఘం అధ్యక్షులు, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ అధ్యక్షులుగా సేవలందించిన కీర్తిశేషులు చొల్లేటి భాస్కరాచారి సంస్మరణ సభ శుక్రవారం స్థానిక సాయి శివ గార్డెన్స్‌లో నిర్వహించారు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొని ఆయనకు అశ్రు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, స్వర్ణకార సంఘం అధ్యక్షులు కటికం వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి గుంటోజు వెంకటాచారి, వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం గౌరవాధ్యక్షులు చేపూరి భీష్మాచారి, ప్రధాన కార్యదర్శి వింజమూరి బ్రహ్మచారి, కోశాధికారి కూరెళ్ల ఇంద్రాచారి మాట్లాడుతూ.. చొల్లేటి భాస్కరాచారి దేవాలయాల అభివృద్ధి, స్వర్ణకారుల సంక్షేమం, బీసీ సంఘాల కార్యక్రమాలతో పాటు ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో చొల్లేటి భాస్కరాచారి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన నేడు మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం చొల్లేటి భాస్కరాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు, స్వర్ణకార సంఘం సభ్యులు, దేవాలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply