Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › జపాన్‌లో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు
బ్రేకింగ్ న్యూస్

జపాన్‌లో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు

11:48 ఉదయం AM

TOMCOM–POGLI మధ్య కీలక అవగాహన ఒప్పందం

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): జపాన్‌లో తెలంగాణ యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) కీలక ముందడుగు వేసింది. జపాన్‌కు చెందిన POGLI Co. Ltdతో TOMCOM శుక్రవారం సచివాలయంలో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన సమక్షంలో జరిగిన కార్యక్రమంలో TOMCOM ఎండీ కాంతి వెస్లీ, POGLI Co. Ltd వ్యవస్థాపకులు, CEO డా. కరుణ్ మల్హోత్రా ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందంలో భాగంగా జపాన్‌లోని వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను గుర్తించడం, సంబంధాలను ఏర్పరచుకోవడం POGLI బాధ్యతగా వ్యవహరించనుంది. అభ్యర్థుల ఎంపిక, రిజిస్ట్రేషన్, ప్రాథమిక స్క్రీనింగ్, డాక్యుమెంటేషన్, జపనీస్ భాషా శిక్షణ, ప్రీ-డిపార్చర్ శిక్షణ వంటి కార్యక్రమాలను TOMCOM చేపట్టనుంది.

జపాన్‌లో ఉద్యోగాలకు అవసరమైన ట్రేడ్ నైపుణ్యాలు, జపనీస్ భాషా ప్రావీణ్యం, అక్కడి పని సంస్కృతి, జీవన విధానంపై అవగాహన కల్పించేలా రెండు సంస్థలు కలిసి శిక్షణ విధానాన్ని రూపొందించనున్నాయి. తొలుత జపాన్‌లోని కన్సాయ్ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించి, అనంతరం ఇతర ప్రాంతాలకు కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు.

తొలి ఏడాదిలో 400 నుంచి 500 మంది తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రెండు సంస్థలు పనిచేయనున్నాయి. జపాన్‌లో ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న తెలంగాణ యువతకు TOMCOM ఇప్పటికే జపనీస్ భాషలో శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.

విదేశాల్లో తెలంగాణ యువతకు సురక్షితమైన, పారదర్శకమైన, దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జపాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా TOMCOM చర్యలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 14🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App