Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › జహీరాబాద్‌లో ఘనంగా కాంగ్రెస్ ప్రజా పాలన 1000 రోజుల విజయోత్సవ ర్యాలీ
బ్రేకింగ్ న్యూస్

జహీరాబాద్‌లో ఘనంగా కాంగ్రెస్ ప్రజా పాలన 1000 రోజుల విజయోత్సవ ర్యాలీ

12:50 మధ్యాహ్నం PM

భారీ ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి, జహీరాబాద్ ఇన్‌చార్జ్ డా. ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. ఏ. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది.

జహీరాబాద్ పట్టణంలోని శుభాష్ గంజ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ డా. ఏ. చంద్రశేఖర్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుమార్ హోటల్ మీదుగా కరెంట్ ఆఫీస్ వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో డా. ఏ. చంద్రశేఖర్ పాల్గొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా డా. ఏ. చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి ద్వారా డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లోనూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరిన్ని కార్యక్రమాలను అమలు చేస్తామని ఆయన అన్నారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ పాలనను ప్రతిబింబించేలా ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు మహమ్మద్ యూనుస్, అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు నరేష్ గౌడ్, మండల అధ్యక్షులు హుగ్గేల్లి రాములు, సువర్ణ–మల్లన్న పాటిల్, ఉదయ్ శంకర్ పాటిల్, పవన్ రాథోడ్, పట్టణ అధ్యక్షుడు ముజాఫ్ఫార్ హుస్సేన్, మాజీ పట్టణ అధ్యక్షుడు కండేం నర్సింలు, తాజా మాజీ మండల, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *