నియామక పత్రం అందించిన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బి. రాథోడ్
దేవరకొండ, అక్టోబర్ 06, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
జాతీయ మానవ హక్కుల సమితి (ఎన్హెచ్ఆర్సి) దేవరకొండ మండల అధ్యక్షుడిగా దేవరకొండ పట్టణానికి చెందిన సిరందాసు వెంకటరమణను నియమించినట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బి. రాథోడ్ మంగళవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్.బి. రాథోడ్ మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ప్రజల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాల్లో తమ సంస్థ ప్రజల పక్షాన నిలుస్తుందని పేర్కొన్నారు.
నూతనంగా నియమితులైన సిరందాసు వెంకటరమణ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బి. రాథోడ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేవరకొండ మండలంలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రజల హక్కులకు సంబంధించిన సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బి. రాథోడ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండి నరేష్ వెంకటరమణకు నియామక పత్రం, గుర్తింపు కార్డు అందజేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సి డివిజన్, జిల్లా, మండల సభ్యులు పాల్గొన్నారు.










Leave a Reply