జర్నలిస్టులకు గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలి: రాష్ట్ర చైర్మన్ తొగరి కరుణాకర్
మంథని, సెప్టెంబర్ 22 (ప్రతినిధి): తెలంగాణ జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేజేఏసీ) విస్తరణలో భాగంగా పలు జిల్లాలకు నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను రాష్ట్ర కమిటీ ప్రకటించింది. రాష్ట్ర చైర్మన్ తొగరి కరుణాకర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా చేరాల రవీందర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల అధ్యక్షులు, నాలుగు జిల్లాల ప్రధాన కార్యదర్శులను నియమించినట్లు టీజేజేఏసీ రాష్ట్ర కమిటీ తెలిపింది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మందుల బాలకృష్ణ నియమితులయ్యారు.
అదేవిధంగా భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండం నాగరాజు, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖాజా గౌస్ ఉద్దీన్, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనగందుల సతీష్, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాయికిని జనార్దన్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ తొగరి కరుణాకర్ మాట్లాడుతూ.. సమాజ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు తగిన గుర్తింపు, న్యాయం లభించడం లేదని అన్నారు. వివిధ రంగాలకు శాసనమండలిలో ప్రాతినిధ్యం ఉన్నట్లుగానే, జర్నలిస్టుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించేందుకు గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను జర్నలిస్టులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ స్థానాల సాధనే లక్ష్యంగా జర్నలిస్టులంతా టీజేజేఏసీ ఆధ్వర్యంలో ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్న ‘జర్నలిస్టుల సమరభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
పెద్దపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు తనపై నమ్మకంతో అప్పగించిన రాష్ట్ర చైర్మన్ తొగరి కరుణాకర్‌తో పాటు రాష్ట్ర నాయకత్వానికి చేరాల రవీందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
— AYUSH24 NEWS
The Voice of Truth










Leave a Reply