Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.7,395.55 కోట్లతో కొత్త పథకం● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో దేవరకొండ నియోజకవర్గం ప్రథమ స్థానం● కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ 3 శాతం పెంపు● భారత్–యూరోపియన్ యూనియన్ సంబంధాల బలోపేతానికి మరిన్ని అవకాశాలు: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్● ‘టైమ్‌లెస్ ఇండియా’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్● జన్యు పరిశోధనల్లో ప్రపంచానికి కీలక కేంద్రంగా భారత్: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్● ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలున్నా పరస్పర గౌరవం అవసరం: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.7,395.55 కోట్లతో కొత్త పథకం● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో దేవరకొండ నియోజకవర్గం ప్రథమ స్థానం● కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ 3 శాతం పెంపు● భారత్–యూరోపియన్ యూనియన్ సంబంధాల బలోపేతానికి మరిన్ని అవకాశాలు: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్● ‘టైమ్‌లెస్ ఇండియా’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్● జన్యు పరిశోధనల్లో ప్రపంచానికి కీలక కేంద్రంగా భారత్: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్● ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలున్నా పరస్పర గౌరవం అవసరం: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
Home › తాజా వార్తలు › టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయానికి ఇష్టానుసారంగా తాళం.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
తాజా వార్తలు

టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయానికి ఇష్టానుసారంగా తాళం.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం

10:00 ఉదయం AM

కార్యాలయ సమయాల్లో సేవలు లేక ప్రజలకు ఇబ్బందులు.. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్

AYUSH24 NEWS | టేకులపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం నిర్ణీత కార్యాలయ సమయాల్లో తెరవకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ ఇష్టానుసారంగా కార్యాలయాన్ని తెరవడం, మూసివేయడం జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమయంలో తాళం వేసి ఉండటంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపులు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, ఇతర ప్రజా సేవల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

“మాకు నచ్చినప్పుడే కార్యాలయం తెరుస్తాం.. మాకు నచ్చినప్పుడే తాళం వేస్తాం” అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయాల్లో కార్యాలయం పనిచేసి ప్రజలకు సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి (DPO), ఎంపీడీఓతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, గ్రామపంచాయతీ కార్యాలయం నిర్ణీత సమయాల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
690 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App