మంత్రి శ్రీధర్ బాబుకు విద్యార్థి నాయకుల కృతజ్ఞతలు
మంథని, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
మంథని పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పట్టణానికి వెలుపల మల్లెపల్లి సమీపంలో ఉండటంతో విద్యార్థినీ, విద్యార్థులు కళాశాలకు వెళ్లేందుకు, తిరిగి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థి నాయకుడు బెజ్జంకి దిగంబర్ తెలిపారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సంబంధిత విద్యాశాఖ అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంథని హైస్కూల్లోకి, బాలుర జూనియర్ కళాశాలను కాలేజీ గ్రౌండ్లోకి మార్చేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల రాకపోకలకు సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు స్పందించిన మంత్రి శ్రీధర్ బాబుకు విద్యార్థి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహిందర్ రెడ్డి, కౌన్సిలర్ ఎల్లంకి వంశీతో పాటు మున్సిపల్ పాలకవర్గానికి బెజ్జంకి దిగంబర్ కృతజ్ఞతలు తెలిపారు.










Leave a Reply