కొత్తగూడెం, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి : టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన లక్కినేని శ్యామ్ గురువారం కొత్తగూడెంలోని డీసీసీ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్నను మండల పార్టీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతనంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన లక్కినేని శ్యామ్‌కు తోట దేవీ ప్రసన్న శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్ ప్రతినిధి










Leave a Reply