Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › దసరా వేడుకల్లో ఎమ్మెల్యే బాలు నాయక్ సందడి.. తుల్జా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు
బ్రేకింగ్ న్యూస్

దసరా వేడుకల్లో ఎమ్మెల్యే బాలు నాయక్ సందడి.. తుల్జా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు

దేవరకొండ, అక్టోబర్ 19 (Ayush 24 News): దసరా పండుగ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఉమ్మడి చందంపేట మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. వివిధ గ్రామాల్లోని తుల్జా భవాని అమ్మవారి ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,

02:48 తెల్లవారుజాము AM

దేవరకొండ, అక్టోబర్ 19 (Ayush 24 News):
దసరా పండుగ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఉమ్మడి చందంపేట మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. వివిధ గ్రామాల్లోని తుల్జా భవాని అమ్మవారి ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.
మొదట నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామంలోని శ్రీ తుల్జా భవాని అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం చందంపేట మండలం దేవరచర్ల గ్రామం, యాపలపాయ తండాలోని తుల్జా భవాని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానావత్ తండాలోని ఆలయాన్ని సైతం సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
అనంతరం చందంపేట మండలం రేకులగడ్డ గ్రామంలో సర్పంచ్‌తో పాటు ఆప్తులను కలుసుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని ఉమ్మడి చందంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుఖసంతోషాలే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ముక్కమల్ల వెంకటయ్య, ఏడుపుల గోవింద్ యాదవ్, వాంకునావత్ బిక్కు నాయక్, లోకసాని కృష్ణయ్య, దొండేటి మల్లారెడ్డి, కోతి యుగేందర్, దొంతినేని వెంకటేశ్వరరావు, కిన్నెర హరికృష్ణ, వాంకునావత్ పాపానాయక్, అంగిరేకుల నాగభూషణం, ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్, కాకునూరి రంగయ్య గౌడ్, బైరెడ్డి కొండల్ రెడ్డి, ఇప్ప భస్వారెడ్డి, గిరి యాదయ్య, కొప్పుల సురేందర్ రెడ్డి, గడ్డం వెంకటయ్య, ఆలయాల పూజారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
— Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 12🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App