మదనాపురం: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం మదనాపురం వ్యవసాయ మార్కెట్‌లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, కోర్టు నూతన భవనం, ఉకచెట్టు వాగుపై హై లెవల్ బ్రిడ్జి వంటి కీలక పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
కురుమూర్తి దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే కర్వేన రిజర్వాయర్ పనులను పూర్తి చేసి 7–8 నెలల్లో నీటితో నింపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మదనాపురం, ముసాపేట, కౌకుంట్ల మండలాల్లో రూ.49 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయ సముదాయాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశామని, దసరాలోపు పనులకు శంకుస్థాపన చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా HAM రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, గత ప్రభుత్వ అప్పుల భారంతో అభివృద్ధి పనులకు నిధులు సమీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రూ.5 లక్షల సహాయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. పేద కుటుంబాలు గృహప్రవేశాలు చేసుకుంటున్న దృశ్యాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని అన్నారు.
విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సులు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు వంటి అవకాశాలను కల్పిస్తున్నామని మంత్రి వివరించారు.
చివరగా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
— Ayush 24 News
The Voice Of Truth
దేవరకద్ర అభివృద్ధికి భారీ నిధులు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన
మదనాపురం: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం మదనాపురం వ్యవసాయ మార్కెట్‌లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply