Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › ఉమ్మడి నల్లగొండ › దేవరకొండ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ఉమ్మడి నల్లగొండ

దేవరకొండ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

07:27 ఉదయం AM

బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చైర్మన్ చేరుపల్లి బాలరాజు

దేవరకొండ: సెప్టెంబర్ 27 (AYUSH24 News ప్రతినిధి)

తెలంగాణ పద్మశాలి సమాజానికి మార్గనిర్దేశకుడిగా, చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు ఆద్యుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ నిలిచారని దేవరకొండ చేనేత సహకార సంఘం చైర్మన్ చేరుపల్లి బాలరాజు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని చేనేత సహకార సంఘం భవనం ముందు ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చేరుపల్లి బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. పదవులు, అధికారాల కంటే ప్రజల హక్కులకే ప్రాధాన్యత ఇస్తూ తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తిని పద్మశాలి సమాజం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, ఆదర్శాలను ఆచరణలో ముందుకు తీసుకెళ్లేందుకు పద్మశాలి సమాజం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సభ్యులు, పద్మశాలి సంఘం నాయకులు, యువజన సంఘం నాయకులు, మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 246🔗 Shares: 6👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App