దేవరకొండ: దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవాసదనం మొదటి అంతస్తు భవన నిర్మాణ నిధికి రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏకుల రఘుపతి రూ.20,000 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని సేవాసదనం ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళికి అందించారు.
ఈ సందర్భంగా ఏకుల రఘుపతి మాట్లాడుతూ దేవరకొండ పెన్షనర్స్ సంఘం కార్యవర్గం అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. తాము ఆర్థికంగా అందించిన సహాయం సంఘం చేస్తున్న సేవలతో పోలిస్తే చాలా చిన్నదని పేర్కొన్నారు.
ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి మాట్లాడుతూ సంఘ సభ్యులు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఎప్పటికీ మరువలేమని, సేవాసదనం భవన నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల నారాయణ రెడ్డి, సహ అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఇజాక్, కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, కార్యవర్గ సభ్యులు ముసిని వీరయ్య, మోటమర్రి పురుషోత్తం, జంపాల యాదగిరి, అలంపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొని దాత ఏకుల రఘుపతికి ధన్యవాదాలు తెలిపారు.
Ayush 24 News
దేవరకొండ పెన్షనర్స్ సేవాసదనం భవన నిర్మాణానికి రూ.20 వేల విరాళం
దేవరకొండ: దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవాసదనం మొదటి అంతస్తు భవన నిర్మాణ నిధికి రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏకుల రఘుపతి రూ.20,000 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని సేవాసదనం ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళికి అందించారు. ఈ సందర్భంగా ఏకుల రఘుపతి మాట్లాడుతూ దేవరకొండ పెన్షనర్స్ సంఘం కార్యవర్గం అందిస్తున్న


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply