Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ MRPS మండల అధ్యక్షుడిగా నీరుకంటి శ్రీశైలం మాదిగ
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ MRPS మండల అధ్యక్షుడిగా నీరుకంటి శ్రీశైలం మాదిగ

దేవరకొండ, సెప్టెంబర్ 27: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా దేవరకొండ మండల నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దేవరకొండ మండల కేంద్రంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్‌లో నూతన మండల కమిటీ ఎన్నిక

10:36 ఉదయం AM

దేవరకొండ, సెప్టెంబర్ 27:
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా దేవరకొండ మండల నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దేవరకొండ మండల కేంద్రంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్‌లో నూతన మండల కమిటీ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడిగా నీరుకంటి శ్రీశైలం మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
MRPS, MSP జిల్లా నాయకులు పండ్ల గోపి మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశానికి MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి, దేవరకొండ మండల ఇన్‌చార్జి బొజ్జ చిన్న మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 7న అమరావతిలో నిర్వహించనున్న MRPS జాతీయ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలను పటిష్టం చేయాలని, గ్రామ కమిటీల ఏర్పాటు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
అనంతరం దేవరకొండ మండల నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా నీరుకంటి శ్రీశైలం మాదిగ, అధికార ప్రతినిధిగా నల్ల రాజు మాదిగ, ఉపాధ్యక్షులుగా పులిజాల మల్లేష్ మాదిగ, ముదిగొండ మహేందర్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా కుక్కముడి శ్రీనయ్య మాదిగ, సంయుక్త కార్యదర్శులుగా కుక్కముడి దేవదానం మాదిగ, గడుసు చిన మహేష్ మాదిగ, కార్యదర్శులుగా నల్ల సైదులు మాదిగ, గండు వెంకటేష్ మాదిగ ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో MRPS జిల్లా సీనియర్ నాయకులు నల్ల వెంకటయ్య మాదిగ, మాతంగి కాషయ్య మాదిగ, సలికినేని జీవ, సందగళ్ల వీరయ్య మాదిగ, గ్రామ కమిటీ అధ్యక్షుడు గుర్జిగల్ల మురళీకృష్ణ మాదిగ, దేవరకొండ మండల సోషల్ మీడియా ఇన్‌చార్జి సలికినేని రామకృష్ణ మాదిగ, కుక్కముడి అంజయ్య, పేర్ల శ్రీకాంత్, మంద చంద్రయ్య మాదిగ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 29🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App