మంథని, అక్టోబర్ 13: మంథనిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరు ఒకే విధంగా ఉందని బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్, మంథని మండల ప్రధాన కార్యదర్శి సామల అశోక్‌కుమార్ విమర్శించారు. ప్రజలకు హామీలు ఇవ్వడంలో ముందుంటున్న ఈ రెండు పార్టీలు అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో మాత్రం విఫలమవుతున్నాయని ఆరోపించారు.
మార్కెట్ నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తారు?
మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ, పట్టణంలో శాఖాహార, మాంసాహార మార్కెట్ నిర్మాణం ప్రకటనలు, ప్రారంభోత్సవాలకే పరిమితమవుతోందని విమర్శించారు. శంకుస్థాపనలు, బోరు పనులు, పనులు ప్రారంభించినట్లు ప్రకటనలు చేస్తున్నప్పటికీ మార్కెట్ నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో పాలకులు చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు.
ప్రజలకు ఎంతో అవసరమైన మార్కెట్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. పనులు పూర్తి చేసి వ్యాపారులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారా? లేక ఆ స్థలాన్ని మరేదైనా అవసరానికి వినియోగిస్తారా? అని నిలదీశారు. కేవలం ప్రకటనలతో ప్రజల అవసరాలు తీరవని, అభివృద్ధి పనులు పూర్తయినప్పుడే పాలకుల చిత్తశుద్ధి తెలుస్తుందని పేర్కొన్నారు. హామీలు కాదు.. అభివృద్ధి కావాలి!
మంథని ప్రజలకు రాజకీయ ప్రసంగాలు, హామీల కంటే పూర్తయిన అభివృద్ధి పనులే ముఖ్యమని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. శాఖాహార, మాంసాహార మార్కెట్ నిర్మాణంపై పాలకులు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తే ప్రజలు తగిన సమయంలో స్పందిస్తారని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో మంథనిలో బీజేపీ జెండా ఎగురవేస్తాం
రానున్న ఎన్నికల్లో మంథని గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా హామీలతో కాలం గడుపుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికైనా పాలకులు రాజకీయ ప్రకటనలను పక్కనపెట్టి శాఖాహార, మాంసాహార మార్కెట్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
Ayush 24 News – ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం!
దొందూ దొందే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరు ఒక్కటే!
మంథని, అక్టోబర్ 13: మంథనిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరు ఒకే విధంగా ఉందని బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్, మంథని మండల ప్రధాన కార్యదర్శి సామల అశోక్‌కుమార్ విమర్శించారు. ప్రజలకు హామీలు ఇవ్వడంలో ముందుంటున్న ఈ రెండు పార్టీలు అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →






Leave a Reply