నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 27వ తారీకు ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో కొండమల్లేపల్లికి చెందిన కరాటే విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతైన విద్యార్థులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ అభినందన కార్యక్రమంలో తహశీల్దార్ మన్నె నరేందర్, సర్పంచ్ యుగంధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి అలాగే టిపిఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు ఆర్ . జైహిందర్, ఎస్. అజయ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులకు కరాటేలో మెళకువలు నేర్పిస్తున్న కరాటే మాస్టర్ కొండ్రపల్లి సురేష్‌ను ఈ సందర్భంగా వారు అభినందించారు.
క్రీడలు విద్యార్థులలో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని, భవిష్యత్తులో విద్యార్థులు మరిన్నిన్నత శిఖరాలను అధిరోహించాలని అతిథులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నల్గొండలో ప్రతిభ చాటిన కొండమల్లేపల్లి కరాటే విద్యార్థులు - పతకాలు సాధించిన క్రీడాకారులు – ఘనంగా అభినందించిన తహశీల్దార్ మన్నె నరేందర్, ప్రముఖులు
నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 27వ తారీకు ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో కొండమల్లేపల్లికి చెందిన కరాటే విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతైన విద్యార్థులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో తహశీల్దార్ మన్నె


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply