సర్పంచుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
నల్గొండ, సెప్టెంబర్ 22 (ప్రతినిధి):
తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నల్గొండ జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుండ్లపల్లి మండలం శాంతిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

అనంతరం చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సర్పంచుల హక్కుల సాధనకు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులకు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు, జిల్లా సర్పంచులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన శాంతిగూడెం గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.










Leave a Reply