దేవరకొండ, అక్టోబర్ 17 (ఆయుష్ 24 న్యూస్): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని దేవరకొండ యువనేత నేనావత్ దేవరన్ నాయక్ పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదుకు వచ్చే నెల నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉన్నందున అర్హులైన యువత, ఉద్యోగులు, విద్యావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తిచేసి మూడేళ్లు నిండిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమని, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుగా ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవాలని కోరారు.
ఇప్పటికే ఓటరు జాబితాలో పేరున్నవారు సైతం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి
గతంలోనే పట్టభద్రుల ఓటరుగా నమోదైనవారు కూడా కొత్తగా ఫారం–18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదు ప్రక్రియను ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ పూర్తి చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
2027 మార్చిలో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని నేనావత్ దేవరన్ నాయక్ విజ్ఞప్తి చేశారు.
పట్టభద్రులందరూ ఓటరు నమోదుపై అవగాహన పెంచుకోవడంతో పాటు అర్హులైన ఇతరులకు కూడా సమాచారం అందించి, ఓటర్ల నమోదు ప్రక్రియ విజయవంతం అయ్యేలా సహకరించాలని కోరారు.
— నేనావత్ దేవరన్ నాయక్
యువనేత, దేవరకొండ
ఆయుష్ 24 న్యూస్
నవంబర్ 6 వరకు దరఖాస్తులకు అవకాశం.. అర్హులైన పట్టభద్రులు నమోదు చేసుకోవాలి నేనావత్ దేవరన్ నాయక్ పిలుపు
దేవరకొండ, అక్టోబర్ 17 (ఆయుష్ 24 న్యూస్): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని దేవరకొండ యువనేత నేనావత్ దేవరన్ నాయక్ పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదుకు వచ్చే నెల నవంబర్ 6వ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply