Breaking News
నాయక్ బుడోకాన్ కరాటే అకాడమీలో ఘనంగా బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు

విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు – జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని గణేష్ మాస్టర్ ఆకాంక్ష

హైదరాబాద్, ఆగస్టు 1 (AYUSH24 NEWS ప్రతినిధి):

నాయక్ బుడోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నడేర్గుల్‌లోని గ్రాఫ్ హై స్కూల్ ప్లేగ్రౌండ్ బ్రాంచ్ విద్యార్థులకు లాల్ దర్వాజాలోని సెయింట్ మేరీ హై స్కూల్లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.

ఈ బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు అకాడమీ హెడ్ సెన్సై & హెడ్ ఎగ్జామినర్ గణేష్ నాయక్ పర్యవేక్షణలో నిర్వహించగా, అకాడమీ బ్లాక్ బెల్ట్ కరాటే సెన్సై కె. సలోని పరీక్షలను నిర్వహించారు.

ఈ పరీక్షల్లో మేధాశ్వి మరియు ఖయ్యూమ్ హుస్సేన్ పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తదుపరి బెల్ట్ స్థాయికి అర్హత సాధించారు. పరీక్షలో విద్యార్థుల బేసిక్స్ (Kihon), కటా (Kata), కుమిటే (Kumite), క్రమశిక్షణ (Discipline), స్వీయ రక్షణ (Self Defence) నైపుణ్యాలను సమగ్రంగా పరీక్షించారు.

ఈ సందర్భంగా సెన్సై కె. సలోని మాట్లాడుతూ, విద్యార్థులు ఎంతో కష్టపడి సాధన చేసి ఈ విజయాన్ని సాధించారని అభినందించారు. శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, స్వీయ రక్షణ కోసం మరింత మంది విద్యార్థులు కరాటే శిక్షణలో చేరాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలను అభినందిస్తూ, పిల్లల్లో క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించడంలో కరాటే కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సెయింట్ మేరీ హై స్కూల్ యాజమాన్యానికి అకాడమీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయక్ బుడోకాన్ కరాటే అకాడమీ అధ్యక్షులు గణేష్ మాస్టర్ మాట్లాడుతూ, బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలో పాల్గొని ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థులను పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం చేసిన సెన్సై కె. సలోనిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే కృషితో రాబోయే జాతీయ, అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లకు విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించారు.

అకాడమీ విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి సంస్థకు, తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని గణేష్ మాస్టర్ ఆకాంక్షించారు.

— AYUSH24 NEWS

“THE VOICE OF TRUTH”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *