Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
బ్రేకింగ్ న్యూస్

పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన

03:21 మధ్యాహ్నం PM

587 మందికి కంటి పరీక్షలు.. 162 మందికి శస్త్రచికిత్సలు

దేవరకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS:

దేవరకొండ మండలంలోని పడమటిపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గత వారం రోజులుగా శంకర్ నేత్రాలయం, హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 587 మందికి కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, 162 మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు పడమటిపల్లి సర్పంచ్ పల్లా శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

పల్లా చంద్రారెడ్డి, పల్లా బాలమ్మ, కీర్తిశేషులు పల్లా ఊర్మిళ, పల్లా నర్సిరెడ్డి మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో, ఇందుర్తి బాలకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, గణపతిరెడ్డి అందించిన ఆర్థిక సహకారంతో శిబిరాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.

శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి అవసరమైన మందులు అందించామని, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సర్పంచ్ పల్లా శ్రీకాంత్ రెడ్డి సూచించారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి వైద్య శిబిరాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో పల్లా శ్రీకాంత్ రెడ్డి, పల్లా కృష్ణారెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పల్లా శ్రీనివాస్ రెడ్డితో పాటు గ్రామస్తులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

AYUSH24 NEWS
నిజమైన సమాచారం • నిష్పక్షపాత వార్తలు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 11🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *