మంథని, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):
మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు సోమవారం యూనిఫాంలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ దండవేన సంధ్య బానేష్ విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలను అందిస్తోందన్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించే విధంగా యూనిఫాంలను స్థానిక మహిళలతో కుట్టిస్తున్నట్లు తెలిపారు.
గ్రామంలోని డ్వాక్రా మహిళలకు యూనిఫాం కుట్టే అవకాశం కల్పించడం ద్వారా వారికి ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు గ్రామ మహిళల తరఫున సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రమాదేవి, చంద్రశేఖర్, సీఏలు కుంట భూలక్ష్మి, నీరటి రాధ, కొప్పుల రమాదేవి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply