సౌర విద్యుత్ ప్రయోజనాలను వివరించిన బూడిద సతీష్ యాదవ్
మంథని, అక్టోబర్ 1 (ఆయుష్ 24 న్యూస్): మంథని ట్రాన్స్‌కో సబ్ డివిజన్ కార్యాలయంలో గురువారం సోలార్ విక్రేతలు ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సోలార్ డిస్ట్రిబ్యూటర్ బూడిద సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల ఏర్పాటు, దరఖాస్తు విధానం, అందుబాటులో ఉన్న సబ్సిడీ తదితర అంశాలపై వివరించి ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. సౌర విద్యుత్ వినియోగంతో విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.
అనంతరం పెద్దపల్లి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కోయా హర్షను సతీష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సౌర విద్యుత్‌కు సబ్సిడీ అందించే ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.









Leave a Reply