తాటికోలు గ్రామంలో గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై సూచనలు
దేవరకొండ, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): జాతీయ పోషణ మాసంలో భాగంగా దేవరకొండ మండలంలోని తాటికోలు గ్రామంలో శుక్రవారం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిరుధాన్యాలు, సిరిధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
సీడీపీఓ చంద్రకళ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తాటికోలు సర్పంచ్ చామల విజయ్ హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
సెక్టార్ సూపర్వైజర్ నేనావత్ రాధ మాట్లాడుతూ చిరుధాన్యాలు, సిరిధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. మహిళలు ఇంటి వద్ద పెరటి తోటలు పెంచుకుని తాజా ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply