దేవరకొండ 13 ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి :
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పువ్వుల పండగ బతుకమ్మ అంటూ బొడ్డుపల్లి పీహెచ్సి సెంటర్ వద్ద మంగళవారం బతుకమ్మ సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా స్టాఫ్ నర్స్, ఎం.ఎల్ హెచ్ పి, ఏఎన్ఎం , ఆశాలు, స్టాఫ్ కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ మహిళలకు ఇష్టమైన పువ్వుల పండగ బతుకమ్మ తొమ్మిది రోజులు గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణాల వరకు బతకమ్మను కులమతాలకు అతీతంగా నిర్వహించే గొప్ప పండుగ బతుకమ్మని తెలిపారు. పిహెచ్సి పరిధిలో ఉన్న మహిళలు ఎంతో ఆనందంగా నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమంలో పీహెచ్సీ పరిధిలోని మహిళలు పాల్గొన్నారు.










Leave a Reply