బొమ్మనపల్లి, సెప్టెంబర్ 21 (ప్రతినిధి): బొమ్మనపల్లి గ్రామంలో డైనమిక్ హీరోస్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కోరం సురేందర్.. ఉత్సవ నిర్వాహకులను అభినందించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, సర్దార్, మహేష్, సురేష్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.










Leave a Reply