Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › బొల్లారం చిన్నారి హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు విక్రమ్‌ అరెస్ట్?
బ్రేకింగ్ న్యూస్

బొల్లారం చిన్నారి హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు విక్రమ్‌ అరెస్ట్?

ఆయుష్ 24 న్యూస్ | హైదరాబాద్, అక్టోబర్ 12: హైదరాబాద్‌ నగరంలోని బొల్లారంలో చిన్నారి అరేలియా కిడ్నాప్‌, హత్య ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విక్రమ్‌ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, నిందితుడి అరెస్టుపై అధికారిక

12:24 మధ్యాహ్నం PM

ఆయుష్ 24 న్యూస్ | హైదరాబాద్, అక్టోబర్ 12:
హైదరాబాద్‌ నగరంలోని బొల్లారంలో చిన్నారి అరేలియా కిడ్నాప్‌, హత్య ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విక్రమ్‌ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, నిందితుడి అరెస్టుపై అధికారిక ధ్రువీకరణ అందాల్సి ఉంది.
సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా దర్యాప్తు
చిన్నారి అదృశ్యం, హత్య ఘటనకు సంబంధించి పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సీసీటీవీ ఫుటేజీ తదితర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. చిన్నారిని కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ వివరాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
ఉద్యోగం నుంచి తొలగించడంతో కక్ష పెంచుకున్నాడా?
విల్లాస్‌ అసోసియేషన్‌ విక్రమ్‌ ప్రవర్తన సరిగా లేదనే కారణంతో వారం రోజుల క్రితమే అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకుని చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇతర సెక్యూరిటీ గార్డుల విచారణ
విల్లాలో పనిచేస్తున్న మరో నలుగురు సెక్యూరిటీ గార్డులను సైతం పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి పాత్రపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 38🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App