Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › భూముల రీ సర్వేపై గ్రామసభ రైతులందరూ అందుబాటులో ఉండి సర్వేకు సహకరించాలి: గ్రామ సర్పంచ్ సంధ్య బానేష్
బ్రేకింగ్ న్యూస్

భూముల రీ సర్వేపై గ్రామసభ రైతులందరూ అందుబాటులో ఉండి సర్వేకు సహకరించాలి: గ్రామ సర్పంచ్ సంధ్య బానేష్

మంథని, అక్టోబర్ 15 (ఆయుష్ 24 న్యూస్): మంథని మండలం గుంజపడుగు గ్రామ పరిధిలోని కాసిపేట శివారులో ఉన్న భూముల రీ సర్వేపై గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ మాట్లాడుతూ.. భూముల రీ సర్వేకు రైతులందరూ సహకరించాలని కోరారు. కాసిపేట

02:54 మధ్యాహ్నం PM

మంథని, అక్టోబర్ 15 (ఆయుష్ 24 న్యూస్): మంథని మండలం గుంజపడుగు గ్రామ పరిధిలోని కాసిపేట శివారులో ఉన్న భూముల రీ సర్వేపై గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ మాట్లాడుతూ.. భూముల రీ సర్వేకు రైతులందరూ సహకరించాలని కోరారు.
కాసిపేట శివారులో భూములు కలిగిన రైతులందరూ తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, భూములకు సంబంధించిన ఇతర రికార్డులు, సర్వే నంబర్ల వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణం తదితర వివరాలు రెవెన్యూ రికార్డుల్లో సక్రమంగా నమోదయ్యేలా రీ సర్వే దోహదపడుతుందని తెలిపారు.
రీ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో భూముల వివరాలను పరిశీలించి, రెవెన్యూ రికార్డులతో సరిపోల్చుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కాసిపేట శివారులో భూములు ఉన్న రైతులందరూ తప్పనిసరిగా సర్వేలో పాల్గొని, అధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని కోరారు.
భూముల సరిహద్దులకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే సర్వే సమయంలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూముల హద్దుల విషయంలో వివాదాలకు తావులేకుండా పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఈ గ్రామసభలో డిప్యూటీ తహసీల్దార్ కిరణ్, డీఐ రమేష్, సర్వేయర్ రాజశేఖర్ చారి, ఉప సర్పంచ్ ఎల్క లక్ష్మి, సదానందం, వార్డు సభ్యుడు దొడ్డిపట్ల శంకర్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 11🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App