మంథని, అక్టోబర్ 13 (ఆయుష్ 24 న్యూస్): మంథని ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మంథనిలో పర్యటించి గోదావరి పుష్కర ఘాట్ వద్ద రోడ్డు నిర్మాణ పనులు, మంథని–రామగుండం రహదారిపై హెలిప్యాడ్ అభివృద్ధి పనులు, సమీకృత డివిజన్ కార్యాలయాల భవనం, నూతన ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రామగిరి మండలంలోని పన్నూరు క్రాస్ రోడ్ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి పుష్కర ఘాట్ వద్ద రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి, మరో 10 రోజుల్లోగా కాంక్రీట్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను నాలుగు రోజుల్లోగా ఖరారు చేయాలని సూచించారు. అవసరమైన నిర్మాణ సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవడంతో పాటు, రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లు, పొదలను తొలగించే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. పనులకు ఆటంకంగా ఉన్న సమస్యలను ఆర్డీఓ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మంథనిలో నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
సమీకృత డివిజన్ కార్యాలయాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, 2027 మార్చి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులకు అవసరమైన అదనపు నిధుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత గడువులోగా భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
మంథని మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, ఇప్పటికే అధిక శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించేందుకు వీలుగా భవనాన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో ఆర్ అండ్ బీ ఈఈ భావ్ సింగ్, ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్ 24 న్యూస్
మంథనిలో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
మంథని, అక్టోబర్ 13 (ఆయుష్ 24 న్యూస్): మంథని ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మంథనిలో పర్యటించి గోదావరి పుష్కర ఘాట్ వద్ద రోడ్డు నిర్మాణ పనులు,


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply