మంథని, సెప్టెంబర్ 21 (ప్రతినిధి): మంథని శ్రీ గౌతమేశ్వర స్వామివారి ఆలయంలో బోయినపేట గ్రామ ప్రజలు రుద్రాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ చైర్మన్ గుండా రాజు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ గౌతమేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల మహేందర్ రెడ్డిలకు బోయినపేట గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పోలు రజిత శివకుమార్, మాజీ కౌన్సిలర్ నక్క నాగేంద్ర శంకర్, టాటా ఏసీ యూనియన్ అధ్యక్షుడు తీగల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply