మంథని, సెప్టెంబర్ 22 (ప్రతినిధి): మంథని పట్టణంలోని పోచమ్మవాడ రైతు గజానన మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మండలి ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.

ఈ పూజా కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు లైశెట్టి రజిత రాజు, ఎల్లెంకి వంశీ, జంభోజు సమ్మయ్య, జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు నరెడ్ల ఓదెలుతో పాటు పోచమ్మవాడ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమం అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర ప్రముఖులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.










Leave a Reply