రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
మంథని, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్:
మంథని పట్టణ అభివృద్ధే మంత్రి శ్రీధర్ బాబు ధ్యేయమని మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి తెలిపారు.
గురువారం మంథని పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ మనోహర్‌తో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణలో భాగంగా చేపడుతున్న పనుల వల్ల నష్టపోతున్న వారిని సంప్రదించి, వారి సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ పనులను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించినట్లు తెలిపారు.
అభివృద్ధి పనుల్లో ఎక్కడా పక్షపాత వైఖరిని అవలంబించవద్దని మంత్రి స్పష్టంగా సూచించినట్లు వారు పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనుల కారణంగా నష్టపోయే వారికి నిబంధనల మేరకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
అలాగే మూల మలుపుల వద్ద, నాలుగు రోడ్లు కలిసే ప్రాంతాల్లో రహదారి విస్తరణకు తగినంత స్థలం ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు వారు వివరించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ పెంటరి రాజుతో పాటు గ్రామస్తులు మహావాది విజయ్ కుమార్, రంగి అమర్నాథ్, జక్కం రంజిత్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply