మంథని: ప్రజల ఆలోచనలకు పదును పెట్టి, సమాజానికి ప్రయోజనం చేకూర్చే చిత్రాలను మంథని వేదికగా త్వరలో నిర్మిస్తామని షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కొండేల మారుతి పేర్కొన్నారు.
మంగళవారం మంథని విద్యార్థి యువత కార్యాలయంలో సాంస్కృతిక కళలు, షార్ట్ ఫిల్మ్స్ ఇతివృత్తంగా గోష్ఠి నిర్వహించారు. ఫిల్మ్ సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు బోగోజు శ్రీనివాస్ సభాధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు రమణ, సాంకేతిక నిపుణులు, షార్ట్ ఫిల్మ్ దర్శకులు నారమల్ల కృష్ణ తదితరులు పాల్గొని షార్ట్ ఫిల్మ్స్ ప్రస్తుత పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలపై చర్చించారు.
ప్రాంతీయ కళాకారులు, స్థానిక ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆడిషన్స్ నిర్వహించాలని దర్శకులు నారమల్ల కృష్ణ సూచించారు. సాంకేతిక కళా నిపుణులు లక్ష్మణ్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
దసరా పండుగ అనంతరం నిర్మించనున్న షార్ట్ ఫిల్మ్స్‌లో ఆసక్తి ఉన్నవారు 93475 90795 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
కార్యక్రమంలో గోదావరిఖని సాంస్కృతిక కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు రమణ, సాంకేతిక కళా నిపుణులు లక్ష్మణ్‌లను ఘనంగా సత్కరించారు.
— AYUSH 24 NEWS
మంథని వేదికగా ప్రయోజనాత్మక షార్ట్ ఫిల్మ్‌ల నిర్మాణం
మంథని: ప్రజల ఆలోచనలకు పదును పెట్టి, సమాజానికి ప్రయోజనం చేకూర్చే చిత్రాలను మంథని వేదికగా త్వరలో నిర్మిస్తామని షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కొండేల మారుతి పేర్కొన్నారు. మంగళవారం మంథని విద్యార్థి యువత కార్యాలయంలో సాంస్కృతిక కళలు, షార్ట్ ఫిల్మ్స్ ఇతివృత్తంగా గోష్ఠి నిర్వహించారు. ఫిల్మ్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →






Leave a Reply