దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
దిండి: మత సామరస్యానికి, ఆధ్యాత్మిక చింతనకు హజ్రత్ షేక్ అబ్దుల్ ఖదీర్ జిలానీ ప్రతీకగా నిలిచారని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
శుక్రవారం దిండి మండల కేంద్రంలో నిర్వహించిన హజ్రత్ షేక్ అబ్దుల్ ఖదీర్ జిలానీ గంధోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ సమాజంలో మత సామరస్యం, సోదరభావం, శాంతి, ఐక్యత వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, స్నేహభావంతో కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు.
ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు సౌభ్రాతృత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
AYUSH 24 NEWS
The Voice of Truth
మత సామరస్యానికి ప్రతీక హజ్రత్ షేక్ అబ్దుల్ ఖదీర్ జిలానీ
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ దిండి: మత సామరస్యానికి, ఆధ్యాత్మిక చింతనకు హజ్రత్ షేక్ అబ్దుల్ ఖదీర్ జిలానీ ప్రతీకగా నిలిచారని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దిండి మండల కేంద్రంలో నిర్వహించిన హజ్రత్ షేక్ అబ్దుల్ ఖదీర్ జిలానీ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply