ఏడాదిలోపు పూర్తి చేస్తాం: మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
మంథని (ఆయుష్ 24 న్యూస్): మంథని పట్టణంలో నూతన వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను మరో రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు, కూరగాయల వ్యాపారులకు సౌకర్యవంతంగా ఆధునిక వసతులతో మార్కెట్‌ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి ఆయన మార్కెట్ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. మున్సిపల్ శాఖ సాంకేతిక ఆమోదం పొందిన నిర్మాణ ప్రణాళికను పరిశీలించి, పనులకు సంబంధించిన వివరాలను అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో మార్కెట్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణంపై అపోహలు, వదంతులను ప్రజలు నమ్మవద్దని కోరారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ఏడాదిలోపు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యుడు పెంటరి రాజు, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply