గంగాపురి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారుల కోసం చిల్డ్రన్ పార్క్ పూర్తి
మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో అభివృద్ధికి మరో అడుగు
మంథని, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అవసరమైన అభివృద్ధి పనులను చేపడుతున్నామని గంగాపురి నాలుగో వార్డు కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు అన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గంగాపురి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారుల కోసం చిల్డ్రన్ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు.
గంగాపురి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు ఆటల ద్వారా వారి శారీరక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు.
గంగాపురి అభివృద్ధిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కౌన్సిలర్ పేర్కొన్నారు. గ్రామానికి అవసరమైన మరిన్ని అభివృద్ధి పనులను గుర్తించి త్వరలోనే మంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎరుకల స్రవంతి రమేష్ బాబు పేర్కొన్నారు.










Leave a Reply