దేవరకొండ పట్టణం:
దేవరకొండ పట్టణంలోని నాలుగో వార్డులో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం దేవరకొండ పట్టణ పరిధిలోని మార్కండేయ స్వామి ఆలయంలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అమ్మవారి చీరల వేలంపాట కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ గారు పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా దుర్గామాత కరుణాకటాక్షాలతో దేవరకొండ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ మేలు జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పున్న శైలజ వెంకటేశ్వర్లు, మహ్మద్ రయీస్, మారుపాకుల సురేష్ గౌడ్, జింకల లింగయ్య, జింకల మధు, వనం నర్సింహా, జింకల మల్లయ్య, అన్నపూరి ఇస్తారి, మారుపల్లి కొండయ్య, జింకల చిన్న లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News
మార్కండేయ స్వామి ఆలయంలో అమ్మవారి చీరల వేలంపాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
దేవరకొండ పట్టణం: దేవరకొండ పట్టణంలోని నాలుగో వార్డులో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఇంటా


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply