గుర్రం గుర్తుపై పోటీ చేసి 56 ఓట్ల మెజార్టీ సాధన
మంథని, అక్టోబర్ 1 (ఆయుష్ 24 న్యూస్): పెద్దపల్లి జిల్లా మంథని మైత్రి ఆటో యూనియన్ ఎన్నికల్లో గుర్రం గుర్తుపై పోటీ చేసిన గడిపెల్లి శ్రీనివాస్ 56 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో యూనియన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన మరోసారి ఎన్నికల్లో గెలుపొందడంతో మద్దతుదారులు, తోటి ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.
విజయం అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన యూనియన్ సభ్యులు, తోటి డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తనకు అండగా నిలిచిన ప్రతి ఆటో కార్మికుడిదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సీనియర్ డ్రైవర్లు తుంగల శ్రీనివాస్, బొలిశెట్టి శంకర్, పెంటరి రాజు, ఏగోలపు చిన్న సమ్మయ్య గౌడ్ అందించిన సూచనలు, ప్రోత్సాహం తన విజయానికి తోడ్పడ్డాయని తెలిపారు. ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
రానున్న రోజుల్లో మైత్రి ఆటో యూనియన్ను మరింత బలోపేతం చేయడంతో పాటు సభ్యుల సంక్షేమం కోసం సమష్టిగా పనిచేస్తానని శ్రీనివాస్ పేర్కొన్నారు. తనను గెలిపించిన ఆటో కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.









Leave a Reply