దేవరకొండ, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు రేపు (శనివారం, అక్టోబర్ 17) నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాల షెడ్యూల్ను విడుదల చేసింది.
ఉదయం 9 గంటలకు: పీఏ పల్లి మండలం రంగారెడ్డి గూడెం గ్రామంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొంటారు. అనంతరం అదే గ్రామంలో మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.
ఉదయం 10 గంటలకు: రంగారెడ్డి గూడెం గ్రామంలో పీఏ పల్లి, గుడిపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులతో నిర్వహించే పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 11:30 గంటలకు: దేవరకొండ మార్కెట్ యార్డులోని ఎమ్మెల్యే నివాసంలో మరో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ, నేరేడుగొమ్ము, చందంపేట, డిండి మండలాలతో పాటు దేవరకొండ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు.
పట్టభద్రుల ఓటరు నమోదుపై నాయకులకు అవగాహన కల్పించడం, అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.
ఇట్లు: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, దేవరకొండ.
ఆయుష్ 24 న్యూస్
రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన
దేవరకొండ, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు రేపు (శనివారం, అక్టోబర్ 17) నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాల షెడ్యూల్ను విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు: పీఏ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply