Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తంగెళ్ల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శ
బ్రేకింగ్ న్యూస్

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తంగెళ్ల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శ

దేవరకొండ, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): చందంపేట మండలం గాగిళ్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ తంగెళ్ల రామకృష్ణారెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్

04:43 సాయంత్రం PM

దేవరకొండ, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): చందంపేట మండలం గాగిళ్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ తంగెళ్ల రామకృష్ణారెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీసి, రామకృష్ణారెడ్డికి మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు.
అనంతరం రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను కలుసుకుని వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కష్ట సమయంలో అధైర్యపడవద్దని, రామకృష్ణారెడ్డికి మెరుగైన వైద్యం అందేలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజాజీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక చొరవ
రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లలో చొరవ చూపారు. ఈ క్రమంలో శుక్రవారం మలక్‌పేట యశోద ఆసుపత్రికి వెళ్లి మరోసారి పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా కల్పించారు.
కాంగ్రెస్ శ్రేణుల హర్షం
తమ పార్టీ సీనియర్ నాయకుడి ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, మెరుగైన వైద్యం అందేలా చొరవ తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఉమ్మడి చందంపేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొని తంగెళ్ల రామకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
— ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 51🔗 Shares: 2👍 Likes: 2
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App