Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › దేవరకొండ › లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ఉచిత కంటి, బీపీ, షుగర్ పరీక్షలు
దేవరకొండ

లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ఉచిత కంటి, బీపీ, షుగర్ పరీక్షలు

11:22 ఉదయం AM

150 మందికి వైద్య పరీక్షలు — 18 మంది కంటి శస్త్ర చికిత్సలకు గుర్తింపు

దేవరకొండ, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

దేవరకొండ పట్టణంలోని సంజయ్ కాలనీలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి, బీపీ, షుగర్ పరీక్షల శిబిరం విజయవంతమైంది. సంజయ్ కాలనీలోని పాఠశాలలో నిర్వహించిన ఈ శిబిరంలో 150 మందికి కంటి, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించగా, 18 మందిని కంటి శస్త్ర చికిత్సల కోసం గుర్తించినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ గుద్దేటి జంగయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక పరిస్థితుల కారణంగా కంటి, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోలేని పేద ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో కాలనీల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే భావనతో లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుద్దేటి జంగయ్య కోరారు. లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కాలనీ ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులను కాలనీ యువకులు శాలువాలతో సన్మానించి అభినందించారు.

కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, పాస్ట్ జోన్ చైర్మన్లు వనం శ్రీనివాసులు, డాక్టర్ పిజె సామ్సన్, పాస్ట్ సెక్రెటరీ లకుమారపు మల్లయ్య, సీనియర్ లయన్ మెంబర్ నీల బుచ్చయ్య, వార్డు కౌన్సిలర్ పొట్ట మధు, దినేష్, వెంకటేష్, అంజి, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 56🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App