పీఏ పల్లి: మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన లోకసాని మల్లా రెడ్డి మృతి బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
సోమవారం తిరుమలగిరి గ్రామంలో మల్లా రెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. మల్లా రెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. మల్లా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి, దుగ్యాల సర్పంచ్ ఆడెపు నగేష్, మద సుధాకర్ గౌడ్, బొడ్డుపల్లి మహేందర్, రమావత్ దామోదర్, జానీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News
లోకసాని మల్లా రెడ్డి మృతి బాధాకరం – దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
పీఏ పల్లి: మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన లోకసాని మల్లా రెడ్డి మృతి బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం తిరుమలగిరి గ్రామంలో మల్లా రెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply