గ్రామ పంచాయతీల్లో చెల్లింపుల జాప్యంపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
గ్రామ పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులకు అడ్డంకులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అభివృద్ధి పనుల నిధుల విడుదల, వివిధ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టింది.
చెక్కుల చెల్లింపు ప్రక్రియ వేగవంతంగా సాగేలా చూడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య విభేదాల కారణంగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయి అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా చూడటమే ఈ మార్గదర్శకాల లక్ష్యంగా పేర్కొన్నారు.
తగిన కారణం లేకుండా ఏడు రోజులకు మించి చెక్కులపై సంతకం చేయకుండా ఉప సర్పంచ్లు కాలయాపన చేస్తే సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టాల్సి ఉంటుంది. విచారణలో ఉప సర్పంచ్ ఉద్దేశపూర్వకంగానే చెక్కులను నిలిపివేసినట్లు తేలితే వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.










Leave a Reply