నిడమనూరు, అక్టోబర్ 9 (ఆయుష్ 24 న్యూస్): ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచే ఆలోచనను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) విరమించుకోవాలని, రూ.5,420.23 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను డిమాండ్ చేశారు.
నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం నిడమనూరు మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఎదురయ్యే సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడం ప్రజలపై మరింత భారం మోపడమేనని పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.57,336 కోట్ల బకాయిలను వసూలు చేయకుండా ప్రజలపై అదనపు భారాలు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరో విద్యుత్ ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతల కారణంగా పంట పొలాలు ఎండిపోతున్నాయని, రైతులకు ఏడు గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో స్టార్టర్లు, మోటార్లు కాలిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించనున్న రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగ పరిరక్షణ, రైతుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను జాతీయ మహాసభల్లో చర్చించి రూపొందించనున్నట్లు తెలిపారు. మహాసభల విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు కోమండ్ల గురువయ్య, వింజమూరు శివ, ముత్యాల కేశవులు, కోటేష్, యాదయ్య, సైదమ్మ, మేరమ్మ తదితరులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth
విద్యుత్ చార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలి
నిడమనూరు, అక్టోబర్ 9 (ఆయుష్ 24 న్యూస్): ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచే ఆలోచనను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) విరమించుకోవాలని, రూ.5,420.23 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను డిమాండ్ చేశారు. నవంబర్ 15 నుంచి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →






Leave a Reply