మంథని, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
మంథని పట్టణంలోని శ్రీ గౌతమేశ్వరాలయం సమీపంలోని గోదావరి నదిలో రేపు నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని శ్రీ గౌతమేశ్వరాలయం చైర్మన్ గుండా రాజు మంథని సీఐ శ్రీ బుద్దె స్వామిని కోరారు.
ఈ సందర్భంగా బుధవారం మంథని సీఐ బుద్దె స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై సీఐ బుద్దె స్వామి సానుకూలంగా స్పందిస్తూ, వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. నిమజ్జన సమయంలో ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా శ్రీ గౌతమేశ్వరాలయం చైర్మన్ గుండా రాజు మాట్లాడుతూ, వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.










Leave a Reply