దేవరకొండ, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):
దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డు ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆదివారం దత్తాత్రేయ అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
ఉదయం స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం మండపం వద్ద ఏర్పాటు చేసిన దత్తాత్రేయ విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply