దేవరకొండ, సెప్టెంబర్ 22 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గణపతి స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద తొమ్మిది రోజులుగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై గణపతి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకం చేశారు.
అనంతరం భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు నక్క వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా దేవాలయంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు చిలువేరు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, కోశాధికారి తాడూరు సత్యనారాయణ, సూపర్వైజర్ గంజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply