Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › సమాచార హక్కు సామాన్యుడి వజ్రాయుధం
బ్రేకింగ్ న్యూస్

సమాచార హక్కు సామాన్యుడి వజ్రాయుధం

ఆయుష్ 24 న్యూస్ | అక్టోబర్ 12, 2026 ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ సమాచారం ప్రజల హక్కు అని, ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వాల ఖర్చులు, పనుల వివరాలను తెలుసుకునే అధికారం ప్రతి పౌరుడికీ ఉందని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు కేతావత్

07:14 ఉదయం AM

ఆయుష్ 24 న్యూస్ | అక్టోబర్ 12, 2026
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ సమాచారం ప్రజల హక్కు అని, ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వాల ఖర్చులు, పనుల వివరాలను తెలుసుకునే అధికారం ప్రతి పౌరుడికీ ఉందని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్ (ఎంటెక్) అన్నారు.
సమాచార హక్కు చట్టం–2005 అమలులోకి వచ్చి 21 సంవత్సరాలు పూర్తయి, 22వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన దేశ ప్రజలకు సమాచార హక్కు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చట్టం అమలు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై పలు కీలక అంశాలను వెల్లడించారు.
సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం
భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ, అధికరణ 21 కల్పించిన జీవించే హక్కుల నేపథ్యంలో సమాచార హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని బాబురామ్ నాయక్ పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఈ చట్టం కీలకంగా నిలుస్తోందన్నారు.
గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాలు, రెవెన్యూ, విద్య, వైద్య, సంక్షేమ శాఖల్లో చేపట్టే పనుల అనుమతులు, అంచనాలు, ఒప్పందాలు, కొలతల పుస్తకాలు, బిల్లుల చెల్లింపుల వివరాలను పౌరులు చట్ట ప్రకారం కోరవచ్చని తెలిపారు. తెలంగాణలో భూ రికార్డులు, ధరణి, పహాణీలు, విద్యార్థుల ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత కోసం సమాచార హక్కును వినియోగించుకోవచ్చని వివరించారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 48🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App