భారీ వర్షంలోనూ రోడ్డుపైకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన మంథని సీఐ
రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపునకు తక్షణ చర్యలు
సీఐని అభినందించిన ప్రయాణికులు, స్థానికులు
రామగిరి, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై రామగిరి మండలం నాగేపల్లి బస్టాండ్ సమీపంలో భారీ వర్షానికి చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మంథని సీఐ బుద్ధె స్వామి వెంటనే స్పందించి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రధాన రహదారిపై నిలిచిపోయిన వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోకుండా స్వయంగా ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు.
అనంతరం జేసీబీని తెప్పించి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించేలా చర్యలు చేపట్టారు. దీంతో కొద్దిసేపట్లోనే రహదారిపై వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.
భారీ వర్షంలోనూ స్వయంగా రోడ్డుపైకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు చెట్టు తొలగింపునకు తక్షణ చర్యలు చేపట్టిన సీఐ బుద్ధె స్వామిని ప్రయాణికులు, స్థానిక ప్రజలు అభినందించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.










Leave a Reply