Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తాజా వార్తలు › సీఐ బుద్ధె స్వామి చొరవతో తొలగిన ట్రాఫిక్ సమస్య
తాజా వార్తలు

సీఐ బుద్ధె స్వామి చొరవతో తొలగిన ట్రాఫిక్ సమస్య

07:43 ఉదయం AM

భారీ వర్షంలోనూ రోడ్డుపైకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన మంథని సీఐ

రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపునకు తక్షణ చర్యలు

సీఐని అభినందించిన ప్రయాణికులు, స్థానికులు

రామగిరి, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై రామగిరి మండలం నాగేపల్లి బస్టాండ్ సమీపంలో భారీ వర్షానికి చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మంథని సీఐ బుద్ధె స్వామి వెంటనే స్పందించి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రధాన రహదారిపై నిలిచిపోయిన వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోకుండా స్వయంగా ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు.

అనంతరం జేసీబీని తెప్పించి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించేలా చర్యలు చేపట్టారు. దీంతో కొద్దిసేపట్లోనే రహదారిపై వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.

భారీ వర్షంలోనూ స్వయంగా రోడ్డుపైకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు చెట్టు తొలగింపునకు తక్షణ చర్యలు చేపట్టిన సీఐ బుద్ధె స్వామిని ప్రయాణికులు, స్థానిక ప్రజలు అభినందించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 42🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App